కొబ్బరి నూనె ఒక మేకప్ రిమూవర్‌గా పని చేస్తుంది. దీంతో అన్నీ రకాల వాటర్ ప్రూఫ్‌లను తొలగించవచ్చును. ఇది శరీరానికి రాసుకుని మసాజ్ చేసుకుంటే మంచిది. చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. తర్వాత చర్మంపైగల దద్దుర్లు, దురద సమస్యలను నివారిస్తుంది, కంటి చుట్టూ రోజూ రాసుకుంటే ముడతలు పడదు.
ఇకపోతే, కొబ్బరినూనెతో మెుటిమలు, కురుపులూ తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం మృదువుగా, ఆరోగ్యంగా తయారవుతుంది, చర్మం నుడతలు పడదు, పొడిబారదు, వీటన్నింటికీ కారణం చర్మాలకు కావలసిన తేమను అందించే గుణాలు కొబ్బరినూనెలో పుష్కలంగా ఉండటమే. దీని గురించి ఇంకా చెప్పాలంటే.....
కొబ్బరినూనె, తేనెను పాళ్లల్లో కలుపి పేస్ట్ చేసి ముఖానికి రాసుకుంటే మచ్చలు, కురుపుల తగ్గుతాయి. దీనిలో చక్కెరను కలిపి దాన్ని చర్మంపై రాసుకుంటే అది లోపలికి వెళ్లి చర్మానికి నునుపునిస్తుంది. మీ చర్మంపై ఏర్పడే గీతలు, గాయాలు పోవాలంటే వాటిపై కొబ్బరినూనె రాయడం వల్ల ఆ బాధల నుంచి శాంతి లభించడంతో పాటు బాక్టీరియాలు చేరవు.