అలా తింటే శరీరంలో మ్యూకస్ ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి పెరుగును పగటి పూటే తినాలి. దీని వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. పాలను రాత్రి పూట తీసుకోవడం మంచిది. దీనివల్ల చక్కగా నిద్రపడుతుంది. ఉదయాన్నే పాలను తాగితే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఉదయం పూట పాలను తీసుకోకూడదు. అయితే వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు ఉదయం పూట పాలను తాగవచ్చు.
ఆపిల్ పండ్లను ఉదయాన్నే తినాలి. రాత్రి పూట యాపిల్స్‌ను తినడం మంచిది కాదు. ఒక వేళ తింటే జీర్ణాశయంలో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి, జీర్ణప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. వాల్‌నట్స్‌ను సాయంత్రం తినాలి. వీటిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనకు సంపూర్ణంగా అందాలంటే సాయంత్రం పూట వాల్‌నట్స్‌ను తింటే సరిపోతుంది. అదే ఉదయం, రాత్రి పూట అయితే వీటిని తినకూడదు. ఎందుకంటే ఆయా సమయాల్లో వీటిని తింటే శరీరానికి సరైన పోషకాలు లభించవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.