పాలు బెల్లం క‌లిపి తాగితే... బ‌రువు త‌గ్గుతారు

మంగళవారం, 1 నవంబరు 2016 (12:34 IST)
మ‌నం నిత్యం టీ, కాఫీ, పాలు తాగేట‌పుడు అందులో పంచ‌దార వేసుకుంటాం. కానీ, అదే బెల్లం క‌లిపిన పాలు తాగితే... అబ్బో ఎన్ని ప్ర‌యోజ‌నాలో... పంచ‌దార మ‌న ఆరోగ్యానికి చాలా చేటు తెస్తుంది. అదే బెల్లం అయితే... చాలా బ‌లం, ఆరోగ్యం కూడా. బెల్లం కలిపిన పాలు తాగితే  బరువు తగ్గుతారు. బెల్లంకు అనీమియా ఎదుర్కోనే శక్తి ఉంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తాగవచ్చు.
 
బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు మృదువుగా, సిల్కీగా మారుతుంది. మహిళలకు ఋతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి ఉపశమనానికి బెల్లం కలిపిన పాలు కాంభినేషన్ సహాయపడుతుంది. ఈ కాంభినేషన్ ఇమ్యూనిటి పవర్‌ను పెంచుతుంది. ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను, మెటాబలిజమ్‌ను మెరుగుపరుస్తుంది. అందుకే... ఇక సుగ‌ర్ జోలికి వెళ్ల‌కండి... పాల‌లో బెల్లం క‌లిపేయండి.

వెబ్దునియా పై చదవండి