నాన్ వెజ్ ఆహారాన్ని చాలామంది బలాన్ని ఇస్తుందని అనుకుంటారు. ఆ సంగతి ప్రక్కన పెడితే వాటికి సమానంగా ఆకు కూరలు కూడా బలాన్ని అందిస్తాయి. రోజువారీగా ఒక కప్పు ఆకుకూర ఆహారంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఏయే ఆకుకూరల నుంచి ఎలాంటి శక్తి లభిస్తుందో చూద్దాం.
1. తోటకూరలో 50 కేలరీల శక్తి లభిస్తుంది. బీ1, బీ2 విటమిన్లు కలిగివుండే తోటకూర కంటిచూపుకు చాలామంచిది.
2. బచ్చలికూరలో 66 శాతం ఇనుము ఉంటుంది. శరీరానికి చలువను, శక్తిని ఈ కూర అందిస్తుంది. మొలలు వంటి వ్యాధులను అరికడుతుంది.
3. అవిశ కూర ద్వారా లభించే ఐరన్ గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళను కరిగించే శక్తి ఈ ఆకుకూరకు ఉంది.