ఈ టీని తయారు చేసుకోవడం ఈజీనే. ఈ రోజుల్లో మోరింగా పౌడర్ ఆన్‌లైన్‌లో, కిరాణా దుకాణాల్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. దీనిని ఫిల్టర్ చేసిన నీటిలో ఉడకబెట్టి, ఆపై ఒడపోసి గ్రీన్ టీని పొందవచ్చు, ఇదే మోరింగా టీ.
అయితే మీకు బ్రాండ్లు, ప్యాకేజ్డ్ పౌడర్‌లపై నమ్మకం లేకపోతే మీరు ఇంట్లో మోరింగా పౌడర్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా కొన్ని తాజా మునగ ఆకులను తీసుకోవాలి. వాటిని డీహైడ్రేట్ చేసి, ఆపై వాటిని పొడి చేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత దానిని ఉడకబెట్టాలి. తదుపరి వడకట్టి తీస్తే అదే మోరింగా టీ(మునగ ఆకులు).