సాధారణంగా మనం వాతావరణ కాలుష్యం ప్రభావం వల్ల గానీ, సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల గానీ, పని ఒత్తిడి వల్ల గానీ ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.
1. దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయం మూడు కప్పుల నీళ్లల్లో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి సగం అయ్యేవరకు నీటిని మరిగించి అందులో ఒక టీస్పూను తేనె కలుపుకుని తాగాలి.
2. దగ్గు నుండి ఉపశమనానికి తులసి ఆకులను తేనెతో కలిపి పరగడుపున తీసుకోవాలి.
3. దానిమ్మ తొక్కలను పొడి చేసి ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూను పొడి కలిపి తీసుకుంటే రక్త శుద్ది జరుగుతుంది.