ఒకప్పటితో పోలిస్తే ఇటీవల రకరకాల పండ్లు అందుబాటులోకి రావడంతో బత్తాయి వాడకం కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ స్థానికంగా పండే బత్తాయిలో పోషకాలే కాదు ఔషధ గుణాలూ ఎక్కువే అంటున్నారు ఆధునిక వైద్య నిపుణులు. ముఖ్యంగా జీర్ణ సమస్యల నివారణకి ఇది ఎంతో మేలు. ఎందుకంటే బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్లను బయటకు పంపేందుకు దోహదపడతాయి.
2. తరచూ ప్లూ, వైరస్‌లతో బాధపడేవాళ్లకి ఈ రసం బాగా పని చేస్తుంది. వీటిలో సమృద్ధిగా ఉండే ప్లేవనాయిడ్లు అల్సర్లని నివారిస్తాయి. ఆస్టియో ఆర్ధ్రయిటీస్, రుమటాయిడ్ ఆర్ద్రయిటీస్‌తో బాధపడేవాళ్లకి ఈ పండ్ల రసం తాగితే నొప్పులూ, పుండ్లు తగ్గుముఖం పడతాయి.