పిల్లలు 2 గంటల కంటే ఎక్కువ సమయం నెట్‌లో గడుపుతున్నారా.. అయితే జాగ్రత్త

శుక్రవారం, 24 జులై 2015 (19:09 IST)
ఇంట్లో పిల్లలు రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఇంటర్‌నెట్‌లో గడుపుతున్నారా.. అయితే ప్రమాదమేనని తాజా అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇటీవల కాలంలో చదువుకునే పిల్లలు ప్రతిరోజు ఎక్కువ సమయం ప్రముఖ సామాజిక మాద్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సైట్‌లలోనే గడుపుతున్నారు. సదరు పిల్లలకు మానశిక రుగ్మతలు ఏర్పడే ప్రమాదం ఉందని, వారికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అధికంగా ఉంటున్నట్టు అధ్యయనం ద్వారా వెల్లడైంది.
 
కెనడాకు చెందిన పరిశోధకులు తాజాగా చేసిన అధ్యయనంలో తేలింది. ఏడేళ్ల వయస్సు నుంచి 12 ఏళ్ల వయస్సు వరకు ఉన్న సుమారు 25 శాతం మంది పిల్లలు ఒక రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నట్టు తెలిసింది. ఈ విధంగా ఎక్కువ సమయం వెబ్‌సైట్‌లలో గడపడే వారికి ప్రమాదం పొంచి ఉండడంతో సదరు సామాజిక మాధ్యమాల వెబ్‌సైట్ పిల్లలకు అవగాహన కలిగించే రీతిలో చిట్కాలను ప్రచురించడం మంచిదని అధ్యయనకారులు తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి