అంగస్తంభన సమస్యలకు చెక్ పెట్టే దానిమ్మ

శుక్రవారం, 31 అక్టోబరు 2014 (16:18 IST)
దానిమ్మలో పొటాషియం, విటమిన్ "ఎ" విటమిన్ "సి" విటమిన్ "బి 6", ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. తరచూ తింటే ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్, బ్రెస్ట్ , ప్రోస్టేట్ , స్కిన్ కాన్సర్‌లకు చెక్ పెడుతుంది. 
 
దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది బరువు పెరగనివ్వదు. అంగస్తంభన సమస్యలకు దానిమ్మ చెక్ పెడుతుంది. రోజుకో గ్లాసు దానిమ్మరసం గర్భిణీలకు ఎంతో ప్రయోజనకారి. దానివల్ల కడుపులో బిడ్డకు కావలసినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది.
 
ఆపిల్ కంటే దానిమ్మలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనతతో బాధపడే వారు ఆపిల్స్ కంటే దానిమ్మను ఎక్కువగా తీసుకోమని సలహాలిస్తుంటారు. దానిమ్మ నేచురల్ కొలెస్ట్రాల్ బూస్టర్. ఇందులో గ్రీన్ టీలో కంటే అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది శరీరంలో ధమనులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది
 
దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్ మిమ్మల్ని యంగ్‌గా కనబడేలా చేస్తుంది. యాంటీఏజింగ్ ఎఫెక్ట్స్‌ను పుష్కలంగా అందించే ఔషధగుణాలు అధికంగా ఉన్నాయి.
 
దానిమ్మలోని విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచడానికి గొప్పగా సహాయపడుతుంది. దగ్గు, జలుబు వంటి వాటిని ఎదుర్కోగలిగే శక్తిని పుష్కలంగా అందిస్తుంది.
 
దానిమ్మ తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు ఆల్కహాల్ అధికంగా మద్యం సేవించే వారు దానిమ్మను అధికంగా తీసుకుంటే కాలేయ సమస్యలను నివారించవచ్చుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి