బంగాళాదుంప తినేందుకు రుచిగా వుండటమే కాకుండా.. అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా చర్మ సమస్యలను తగ్గిస్తుంది. బంగాళాదుంపలు గుండె వ్యాధుల నిరోధించటానికి బంగాళాదుంప ఎంతగానూ సహాయపడుతుంది. అలాగే మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు కూడా బంగాళాదుంపలో లభిస్తాయి.
ముఖ్యంగా వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి, అల్సర్ వంటి అనేక సమస్యలను నివారిస్తుంది. క్యాన్సర్‌తో బాధపడే వారు కూడా బంగాళాదుంప జూస్ తాగడం వల్ల వీటిలో ఉండే యాంటీ క్యాన్సర్ కణాలు పెరగకుండా నివారిస్తుంది.
బంగాళాదుంపలో ఉండే పిండిపదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా మధుమేహం, కిడ్నీ, కాలేయ వ్యాధి, రక్తపోటు వంటి అనేక రకాల జబ్బులను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా తలనొప్పి ఉపశమనానికి బంగాళాదుంప మంచి రెమిడీగా పని చేస్తుంది.