వాతావరణ మార్పుల వల్ల, శీతలపానీయాలను ఎక్కువగా తాగడం వలన ఇది ఎక్కువగా వస్తుంది. అయితే పొడి దగ్గు తగ్గాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. దీంతో దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో మీరూ చూడండి..
* పొడి దగ్గు బాధిస్తున్నప్పుడు కాస్త అల్లం టీ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
* అర టీ స్పూన్ శొంఠి పొడిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
* చిటికెడు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి.
* కరక్కాయ కూడా పొడిదగ్గును తగ్గించడంలో దోహదపడుతుంది. కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
* తమలపాకులను నమలడం వల్ల కూడా పొడి దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు.
* తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా కూడా దగ్గును తగ్గించుకోవచ్చు.
* పొడి దగ్గుతో బాధపడుతుంటే అర టీ స్పూన్ ఇంగువపొడి, ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం, ఒక టేబుల్ టీ స్పూన్ తేనెలను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల దగ్గును తగ్గించుకోవచ్చు.