మౌత్ అల్సర్‌కు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి?

శనివారం, 6 డిశెంబరు 2014 (18:37 IST)
నోటి పూత లేదా మౌత్ అల్సర్‌కు చెక్ పెట్టాలంటే... చల్లటి నీటితో పుక్కిలించి ఉమ్మాలి. తర్వాత లవంగాన్ని బుగ్గన పెట్టుకుని దాని రసం పుండు మీదకు వచ్చేలా చేయాలి. అలా చేస్తే నొప్పి తగ్గడంతో పాటు అల్సర్ నోరంతా వ్యాపించకుండా తగ్గుతుంది. 
 
ఉప్పు నీటితో పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది. ఐదారు తులసీ ఆకులను నమిలి మింగాలి. రోజులో నాలుగైదు సార్లు ఇలా చేస్తే రెండు రోజుల్లోనే అల్సర్ మాయమవుతుంది. నోటిపూతను, పుళ్లను తగ్గిచడంలో తేనె చాలా పనిచేస్తుంది. ఒక స్పూను తేనెను అరచేతితో వేసుకుని వేలితో తీసుకుని పుండు మీద రాయాలి. పూత ఉంటే నోరంతా రాయాలి. 

వెబ్దునియా పై చదవండి