నీరసంగా ఉన్న సమయంలో గ్లాసు చెరకురసం తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో ఉండే సూక్రోజును శరీరం వెంటనే స్వీకరించడమే అందుకు కారణం. అలసట కూడా దూరంచేసెందుకు సహాయపడుతుంది. చెరకులో క్యాల్షియం ఉండటంతో అది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్న పిల్లల ఎదుగుదలకు చెరకు రసం చక్కగా దోహదపడుతుంది. అంతేకాదు, వెన్నెముక బలంగా ఉండటానికి కూడా చెరకు ఉపయోగపడుతుంది.