వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందాలంటే...

బుధవారం, 4 జూన్ 2014 (15:12 IST)
* ప్రస్తుతం వేసవి కాలంలో విపరీతమైన వేడి పుట్టుకొచ్చేస్తుంటుంది. దీంతో అలసట, దప్పిక, చికాకు తదితరాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో పుదినా ఆకుల పొడి ఒక చెంచా, అరచెంచా యాలకుల పొడిని ఓ గ్లాసు నీటిలో కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. 
 
* పుదినా ఆకులను ఎండబెట్టి పొడితో దంతాలను శుభ్రం చేస్తే నోటి దుర్వాసన మటుమాయమౌతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
* ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఒక చెంచా పుదీనా రసాన్ని ఓ కప్పు నీటిలో కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి