కొన్నిసార్లు బాధ, దుఃఖం, ఆవేశం లాంటి భావోద్వేగాలు కూడా ఆస్తమాను పెంచుతాయి. కాబట్టి భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి. ఇన్‌హేలర్స్ ఎప్పుడూ చేతికి అందేంత దగ్గర్లో ఉంచుకోవాలి. పిల్లలు వాడుతుంటే కనుక వాళ్లకు బడిలో ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఇన్‌హేలర్స్ ఎలా ఉపయోగించాలో వాళ్ల టీచర్‌కు చెప్పాలి.
కూల్‌డ్రింక్స్, వేపుళ్లు, పచ్చళ్లు, పెరుగును తినకూడదు. మరీముఖ్యంగా రాత్రివేళ వీటికి దూరంగా ఉండాలి. అలర్జీకి కారణమయ్యే పదార్థాలేవో తెలుసుకుని వాటి లిస్ట్ తయారుచేయాలి. ఆ పదార్థాలకు దూరంగా ఉండాలి.