కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య. ఈ సమస్యతో ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైన వేళల్లో తీసుకోకపోవడమే. ఈ క్రింది అద్భుత చిట్కాతో గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేమిటో తెలుసుకుందాం.
వాము 250 గ్రాములు, జీలకర్ర 250 గ్రాములు, ధనియాలు 250 గ్రాములు, కరక్కాయ పెచ్చులు 250 గ్రాములు, నల్ల ఉప్పు 50 గ్రాములు. మొదటి నాలుగింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించాలి.
ఆ తర్వాత అన్నిటినీ కలిపి మెత్తటి చూర్ణంగా చేయాలి. నల్ల ఉప్పు పౌడర్ కలిపి ఆ చూర్ణమును ఒక డబ్బాలో గాలి పోకుండా నిలువ చేసుకోవాలి. ఒక స్పూన్ చూర్ణము భోజనం చేసిన తరువాత తీసుకోవాలి. ఇలా చేస్తుంటే గ్యాస్ సమస్యను నిరోధించవచ్చు. దీనితో పాటు నూనె వేపుళ్లు, పప్పు, పులుపు, పెరుగు ఎక్కువగా వాడకుండా వుండాలి.