మొలకెత్తిన గింజలను ఎందుకు తీసుకోవాలో తెలుసా?

గురువారం, 10 మే 2018 (21:17 IST)
మనం రోజు వారి తినే ఆహారంలో మెులకలను చేర్చుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి  వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు తినవచ్చు. వీటిలో విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శుధ్ది చేస్తాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరం చైతన్యమై నిత్యయవ్వనంగా కనిపిస్తారు. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. గింజలను మెులకెత్తించినుపుడు వాటిలో పోషక స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా పెసలు, మినుములు, శనగలు, బొబ్బర్లు, గోధుమలు, వేరుశనగ, బఠానీలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 
2. పోషకాల నిధి మెులకెత్తిన గింజలలో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు ఉంటాయి. మెులకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. ఆరోగ్యానికి హానికరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి వీటిలో ఉండవు.
 
3. మెులక ధాన్యాలలో ఎ, బి కాంప్లెక్స్, సి విటమిన్లు అత్యధికంగా కనిపిస్తాయి. మెులకలలో క్షార గుణం ఉంటుంది.
 
4. మెులకలను గర్భిణీ స్త్రీలు తింటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. మెులకలలో పీచు పదార్ధం ఎక్కువుగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది.
 
5. మెులకెత్తేటప్పుడు విటమిన్ ఎ రెండు రెట్లు, విటమిన్ బి,సిలు ఐదు రెట్లు అధికంగా లభ్యమవుతాయి. ఖనిజ లవణాలు అయిన ఇనుము, ఐరన్, ఫాస్పరస్, జింక్ శరీరానికి సులభంగా అందుబాటులో ఉండేలా తయారవుతాయి. పళ్లు, ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. రక్తహీనత కూడా దరిచేరదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు