వాల్‌నట్స్... ఇవి తీసుకుంటుంటే వయసు పైబడిన ఛాయలు...అంటే వృద్ధ ఛాయలు అగుపించవని తాజా పరిశోధనల్లో తేలింది. కనుక రోజూ ఓ నాలుగు వాల్‌నట్స్ తీసుకుంటే యవ్వనంగా ఉండటమే కాకుండా గుండెను భద్రపరుచుకున్నట్లేనని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. రోజువారీ ఆహారంతో పాటు కాసిని వాల్‌నట్స్‌ని కూడా చేర్చుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
బాదం, పిస్తా, వేరుశెనగ వంటి పప్పులతో పోల్చుకుంటే వాల్‌నట్స్ గుండెకు చాలా మేలు చేస్తాయని, గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉన్నాయని తేలింది. రోజువారీ మెనూలో వాల్‌నట్స్ ఉండేలా చూసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని, ఇతర వాటితో పోల్చుకుంటే వీటిలో రెండు నుండి పదిహేను రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది.