ఈ సాల్ట్‌ను ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీల తయారు చేసే ఆహార పదార్థాలలో విరివిగా వాడుతారు. దీనివాడకంతో చక్కని రుచి వస్తుంది. అదేసమయంలో ఎంఎస్‌జీ వేసిన ఆహారాలను ఆరగించడం వల్ల ఆరోగ్యానికి కలిగే హాని ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
* ఎంఎస్‌జీ ఎక్కువగా తినడం వల్ల మైగ్రేన్, బద్దకంగా ఉండటం, హార్మోన్ల అసమతుల్యత, వికారం, నీరసం, ఛాతి నొప్పి తదితర సమస్యలు.
* ఎంఎస్‌జీ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటుంటే హైబీపీ, డయాబెటిస్, కండరాలు ముడుచుకుపోవడం, కాళ్లు, చేతుల్లో సూదులు గుచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
* సాస్‌లు, చిప్స్, ప్రిపేర్డ్ సూప్స్, హాట్ డాగ్స్, బీర్లు, క్యాన్డ్ ఫుడ్స్ తదితర ఆహారాల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు. మొత్తంమీద అతిగా తింటే మాత్రం పైన చెప్పిన విధంగా అనర్థాలు కలుగుతాయి.