ప్రస్తుత కాలంలో చాలామంది షుగర్ వ్యాధితో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడుతున్నా తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడం వల్ల షుగర్ వ్యాధి పెరిగి పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వ్యాధిని మనం ఇంట్లో రోజూ వాడే పచ్చి ఉల్లిపాయతోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
1. రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను ఖచ్చితంగా తినాలి. 50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తింటూ ఉండాలి.