ఇంట్లో వుండి పనిచేస్తున్నారా? వాటి జోలికెళ్లొద్దు..? (video)

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (18:08 IST)
ఇంట్లో వుండి పనిచేస్తున్నారా? అయితే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే.. అంతే సంగతులు అంటున్నారు.. వైద్యులు. ఇంట్లో ఉండి వర్క్ చేసేటప్పుడు డైట్ కూడా కాస్త మార్చుకుంటే మంచిదంటున్నారు. ఇంట్లో ఉండేటప్పుడు శరీరానికి శ్రమ ఉండదు. కాబట్టి దానికి తగ్గట్టు డైట్‌‌లో మార్పులు చేసుకోవాలి. ఈజీగా జీర్ణమయ్యే ఆహారాలు, ఫ్రూట్స్, ఆకుకూరలు ఎక్కువగా తింటుండాలి. 
 
ముఖ్యంగా ఇంట్లోఉండేటప్పుడు షుగర్, ఆల్కహాల్, హై ఫ్యాట్ ఫుడ్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. అప్పుడప్పుడు స్నాక్స్ కోసం పల్లీల లాంటివాటిని తీసుకోవడం మంచిది. అలాగే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రతీ అరగంటకొకసారి నీళ్లు తాగడం మర్చిపోకూడదు. దాంతో పాటు వారానికొకసారి బరువు చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమే. ఏదైనా తింటూ వర్క్ చేసే అలవాటును మానుకుంటే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే ఫ్రూట్స్, ఓట్స్ లాంటివి తింటే మంచిది.
 
ఇంట్లో ఉంటూ బరువు పెరగకుండా చూసుకోవాలంటే… ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి.. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయొద్దు. నీళ్లు తాగడం మర్చిపోవద్దు. వ్యాయామం చేయడం మరిచిపోకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంట్లో ఉంటూ పని చేసేటప్పుడు ఎప్పుడూ కూర్చునే ఉండకుండా మధ్యలో ఫిట్‌‌నెస్ బ్రేక్స్ ఇస్తుండాలి. అంటే మధ్యమధ్యలో శరీరానికి ఏదైనా యాక్టివిటీ ఇస్తుండాలి. వర్క్ మధ్యలో కాఫీ బ్రేక్ తీసుకుని అటు ఇటు నడుస్తుండాలి. అలాగే వర్కవుట్స్ కోసం రోజూ ఉదయం లేదా సాయంత్రం కొంత టైం కేటాయించాలి. ఇంట్లోనే కూర్చోకుండా గార్డెన్ లేదా ఆరుబయట కాసేపు నడవడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా రిలాక్స్ అవుతుంది. 
 
మహిళలైతే ఇంటి పనికి, ఆఫీసు పనికి క్లాష్ కాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నా.. పురుషులు ఆఫీసు పనులకే పరిమితమవుతున్నారు. అలాంటివారు.. ఎక్కువ తినకుండా డైట్ పాటించాలి. కానీ మహిళలు ఆఫీసు, ఇంటి పనిచేస్తూ ఒత్తిడికి లోనవుతున్నారు. అలాంటి మహిళలు ప్లాన్ ప్రకారం పనిచేసుకోవడం మంచిది. టైమ్ కేటాయింపును మరిచిపోకూడదు. చేతనైతే ఇంట్లోని వారి సాయం తీసుకోవడం మంచిది. 
 
వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాంటి అంతరాయం లేకుండా సాగాలంటే… ఆఫీస్‌‌లో ఉన్నట్టే ఇంట్లో కూడా వర్కింగ్ అవర్స్‌‌ను సెట్ చేసుకోవాలి. ఆ టైంలో ఎవరినీ దగ్గరకు రావొద్దని చెప్పాలి. ముఖ్యంగా పిల్లలు, పెట్స్ పనిని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రపోయే టైమింగ్స్ కూడా ఎప్పటి లాగానే ఉండాలి. వాటిలో మార్పులొస్తే.. డైలీ రొటీన్ అంతా మారిపోతుంది. అది వర్క్‌‌కు ఇబ్బంది కలిగించొచ్చు. అలాగే వర్క్ కోసం డెడికేటెడ్‌‌గా ఒక ప్లేస్‌‌ను ఏర్పరచుకోవాలి. అలా చేస్తే.. ఆ ప్లేస్‌‌కు వెళ్లగానే ఆఫీస్ పనులు తప్ప ఇంకేవీ చేయకుండా ఉండే వీలుంటుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు