రుద్రాక్ష మాల ఎలాంటి సమయాల్లో ధరించకూడదు..?

శనివారం, 16 మార్చి 2019 (10:37 IST)
రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. 
 
అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనైనవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులో నుంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెప్తున్నాయి. 
 
రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి.  1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. 2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. 3. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. 4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు 5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు 6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. 7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు