బ్రహ్మోత్సవాలు : అంకురార్పణ పూర్తి... నేడు ధ్వజారోహణం... శ్రీవారికి వాహనసేవలు

బుధవారం, 16 సెప్టెంబరు 2015 (06:37 IST)
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. మంగళవారం సాయంతర్ం అంకురార్పణ జరిగింది. నేడు ధ్వజారోహణం తరువాత వాహనసేవలు ఆరంభం అవుతాయి. ప్రభుత్వం తరుపున చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు. నేడు తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకలను భారీగా ఏర్పాట్టు చేశారు. తిరుమలను విద్యుత్తుదీపాలంకరణతో తీర్చిదిద్దారు. 
 
నేటి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరుమల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం చేశారు. చిత్రపటాన్ని, తిరుమల ఆలయంలోని ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. అనంతరం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో స్వామి వారు పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. బుధవారం సాయంత్రం తిరుమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో కుటుంబసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారు. రాత్రి తిరుమలలోనే బస చేసి గురువారం ఉదయం తిరుగు ప్రయాణమవుతారు. 
 

వెబ్దునియా పై చదవండి