తిరుమలలో వేడుకగా గురువందన మహోత్సవాలు

శుక్రవారం, 31 జులై 2015 (12:22 IST)
గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల ఆస్థాన మండపంలో గురువందన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉత్సవాలు శుక్రవారం ఉదయం ఆరంభమయ్యాయి. 
 
ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భజన మండళ్లు ఉత్సవాల్లో పాల్గొన్నాయి. ఆధ్యాత్మిక, ధార్మిక సందేశాలు ఇవ్వడంతో పాటు, తిరువీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. ఉత్సవాల్లో తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు.
 

వెబ్దునియా పై చదవండి