కిటకిటలాడుతున్న కాణిపాకం... వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు

గురువారం, 17 సెప్టెంబరు 2015 (09:34 IST)
వినాయక చవితి సందర్భంగా వరసిద్ధి వినాయకుడు కొలువున్న కాణిపాకం కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి క్యూ కట్టారు. ఆలయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. రకరకాల పుష్పఫలాలతో అలంకరణ చేశారు. 
 
వినాయక చతుర్ధశి వచ్చిందంటే చిత్తూరు జిల్లా వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భక్తులు క్యూ కడతారు. స్వయంభూ వెలసి వరసిద్ధి వినాయకుడికి ఇక్కడ తెల్లవారు జాము నుంచే పూజలు ఆరంభమవుతాయి. 
 
చవితి నాడు స్వామి దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇది సరిహద్దు ప్రాంతం కావడంతో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాలలో కాణిపాకం చేరుకుంటున్నారు. ఆలయంలో సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనాలలో కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు. 
 
పుష్పల ఫల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజులలో వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. 

వెబ్దునియా పై చదవండి