రథసప్తమి ఏర్పాట్లను సమీక్షించిన జేఈవో

మంగళవారం, 20 జనవరి 2015 (21:05 IST)
తిరుమలలో జరుగబోయే రథసప్తమి ఏర్పాట్లను తిరుమల జేఈవో శ్రీనివాస రాజు సమీక్షించారు. ఒకే రోజున జరిగే కార్యక్రమాన్ని మిని బ్రహ్మోత్సవాలుగా పరిగణిస్తారు. ఒకే రోజున వేంకటేశ్వర స్వామికి సంబంధించిన అన్ని వాహానాలలో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  తిరుమలలో భారీ బంధోబస్తును ఏర్పాటు చేస్తారు. 
 
26న జరగబోయే రథ సప్తమిని పురష్కరించుకుని భారీ ఎత్తున భక్త జనం తిరుమలకు చేరుకుంటారు. ఒకే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాహన సేవలు అన్ని జరుగుతాయి కనుక ఇక్కడకు వచ్చే భక్తులు కూడా అదే స్థాయిలో ఉంటారు. దీంతో తిరుమలలో అధికారులు భారీ ఎత్తు బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. అన్ని విభాగాల అధికారులతో జేఈవో ఉదయం సమీక్ష నిర్వహించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నీరు, ఆహారం వంటి వాటని ఏర్పాటు చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి