ఉమ్మెత్త పువ్వులతో శివుని పూజ ఎందుకు? ఏడు జన్మల పాపం తొలగిపోవాలంటే? మామిడి రసంతో?

శనివారం, 24 జూన్ 2017 (12:43 IST)
ఉమ్మెత్త పువ్వులంటే శివునికి ఎంతో ఇష్టం. ఒకే ఒక ఉమ్మెత్త పువ్వును శివుని వద్ద వుంచి వేడుకుంటే.. భక్తులకు మోక్షం సిద్ధిస్తుంది. కేరళలోని శివుని ఆలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది. మాంగల్య భాగ్యం లభించాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలి.

ఇంకా ఉమ్మెత్త పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులంటే భలే ఇష్టం. అలాగే దుర్గాదేవిని ఉమ్మెత్తపూలతో పూజిస్తే.. దారిద్ర్యం తొలగిపోతుంది. నవరాత్రి రోజుల్లో ఏడో రోజు సరస్వతీ దేవీ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజున సరస్వతీ దేవి విగ్రహం ముందు ఉమ్మెత్త పువ్వులతో రంగోలి వేసి పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.  
 
అలాగే ప్రదోష కాలంలో శివుడిని అర్చిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. సర్పదోషంతో పాటు ఇతర దోషాలు తొలగాలంటే ప్రదోష సమయంలో శివుడిని అర్చించాలి. మాసానికి రెండుసార్లు ప్రదోషం వస్తుంది. అంటే అమావాస్యకు, పౌర్ణమికి ఒక్క రోజు ముందు ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారని విశ్వాసం. అలాంటి సమయంలో శివునిని దర్శించుకుంటే.. శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. ప్రదోషం రోజున సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో నందీశ్వరుడిని పూజించాలి. ఈ రోజున వ్రతమాచరించి.. సాయంత్రం ఆరు గంటలకు తర్వాత భోజనం తీసుకునే వారికి, ఆధ్యాత్మిక పరంగానే కాకుండా.. ఆరోగ్య పరంగానూ ఎంతో మేలు చేకూరుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. 
 
అందుకే ఆ రోజున ఆయనకు పాలాభిషేకం చేయిస్తే.. మంచి ఫలితం లభిస్తుంది. బిల్వ పత్రాలు, కొబ్బరిబోండాం నీటితో అభిషేకం చేయిస్తే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇదే రోజున ఉమ్మెత్త పువ్వులతో శివునికి అర్చన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఏడేడు జన్మల పాటు చేసిన పాపాలు తొలగిపోతాయి. బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది. శనివారం పూట వచ్చే ప్రదోషాల్లో ఈశ్వరుడిని స్తుతిస్తే.. ఈతిబాధలు, అష్టకష్టాలు తొలగిపోతాయి. శనిదోషాలు కూడా తొలగిపోతాయి.
 
అలాగే శివునికి మామిడి పండ్ల రసంతో స్వామికి అభిషేకం చేయడం వలన ధనధాన్యాలు చేకూరుతాయి. జీవితంలో ధనధాన్యాలకి లోటు వుండదు. ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోవాలంటే.. మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి