అక్కర్లేని చెత్తని తీసేస్తే మాత్రమే అక్కడ అవసరమైన సంపదను...?

గురువారం, 21 మే 2015 (14:49 IST)
భగవంతుడు దశావతారాల గురించి తెలిసిందే. అయితే ఆయన రాకవల్ల ఏమైనా మార్పు ఉపయోగం జరిగిందా అని గమనించండి. ఎవరు వచ్చినా పోయినా, మీరు మాత్రం ఎదగడానికి తయారుగా లేనంతకాలం మీ జీవితాన్ని ఎవరూ మార్చలేరు. మహాత్ముల రాక మాత్రమే పూర్తి అవగాహనను, జ్ఞానాన్ని కలిగించలేదు. మీరు మారాలనుకుంటే మాత్రమే మార్పు ఏర్పడుతుంది. 
 
మీ జీవితాన్ని మీరు జీవించడం సరిగా నేర్చుకుంటే లాభమే తప్ప మీరు మారడానికి తయారుగా లేనపుడు భగవంతుడు అవతరించినా ఏ అర్థం ఉండదు. పదివేల సార్లు మహాత్ములు వచ్చినా ఏ మార్పు జరగదు. అందుకే దేవుడికోసం ఎదురుచూడకండి. ఎవరో చెప్పిన వేదాంతాన్ని అలాగే స్వీకరించండి. మహాత్ముల గురించి పుస్తకాలను ప్రోత్సాహ కారణాలుగా మాత్రమే వాడుకోండి. అదే మీ జ్ఞానంగా భావించి మనస్సును మార్చుకోండి. 
 
అక్కర్లేని చెత్తని తీసేస్తే మాత్రమే అక్కడ అవసరమైన సంపదను నింపుకోవచ్చు. తెలీదని అంగీకరించేటప్పుడు అహంకారం తొలగి తెలుసుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది.

వెబ్దునియా పై చదవండి