అసలు యోగా ఎందుకు చేయాలి.. గురూజీ?

శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:55 IST)
పుట్టినప్పటి నుంచి మనం ఎన్నోసార్లు రకరకాల దుస్తుల్ని ధరిస్తూ.. మారుస్తూ ఉంటున్నాము, ఎన్నోసార్లు ఇల్లు మారుతూ ఉంటాము. అలాగే మనం భుజించే ఆహారం కూడా రక రకాల రుచులతో భుజిస్తున్నాము. కాని మార్పు లేకుండా కడవరకు మనతో ఉండేది మాత్రం మన శరీరం. 
 
మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే, మన కల నెరవేర్చడానికి ఆ శరీరం తోడ్పడుతుంది. మన మనసు మీరు చెప్పిన విధంగా వినకుండా, దాని ఇష్ట ప్రకారము ఆలోచనలు పెంపొందిస్తుంది. మీ కలలు నెరవేరాలంటే మీ మనసు పట్టుదలతో తోడ్పడాలి. 
 
మీ మనసు మీ శరీరము మీరు నచ్చినవిధంగా పనిచేయాలని అంటే మీ మనస్సుని, శరీరాన్ని, మీకు అనుకూలంగా తిప్పు కోవాలి. అలా అనుకూలంగా మనవైపు మరల్చుకొనేదే యోగా.

వెబ్దునియా పై చదవండి