తిరుమలలో అందమైన తెప్పలపై ఊరేగిన మలయప్ప స్వామి

మంగళవారం, 3 మార్చి 2015 (20:23 IST)
తిరుమలలో తెప్పోత్సవాల సందర్భంగా మలయప్ప స్వామి పుష్కరణిలోని తెప్పలపై ఊరేగారు. మంగళవారం సాయంత్రం సతీసమేతంగా ఊరేగింపుగా తిరుమాడ వీధులలో ఊరేగిన స్వామి వారు అనంతరం పుష్కరణిలోని పుష్పాలతో అలంకరించిన తెప్పలపై ఊరేగారు. వార్షిక ప్లవతోత్సవంలో భాగంగా మూడో రోజు భక్తులకు మలయప్ప స్వామి కనువిందు చేశారు. వారిని కరుణించాడు. 
 
 మొదటి రెండు రోజులు శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలలో దర్శనం ఇచ్చిన స్వామి మూడోరోజు మలయప్ప స్వామిగా తెప్పలపై ఊరేగారు. సాయంత్రం 7 నుంచి 8 గంటలకు మధ్యలో పుష్కరణలోని వసంత మండపం చుట్టూ మూడు మార్లు తిరిగిన స్వామి మండపలో కొలువుదీరారు.  
 
ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి కేఎస్ శ్రీనివాస రాజు, ఏవిఎస్వో శివకుమార్ రెడ్డి, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ ఆర్ సెల్వం, శ్రీ కేశవ రాజు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి