భాగవతాన్ని ఎంతగా పఠిస్తే.. అంతగా భగవంతునికి..?

గురువారం, 11 సెప్టెంబరు 2014 (14:01 IST)
దైవం పట్ల భక్తి, విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి. భాగవత గ్రంథం ఒక్కసారి కాదు. ప్రతిరోజూ పఠించాలి. ఎంతగా పఠిస్తే, అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి. భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాం. 
 
ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే. ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అంచలంచల విశ్వాసం ఉంచటం ఎంత అవసరమో తెలుస్తుంది. 
 
భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో, ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది.
 
ఎన్ని రూపాలలో, ఎంతమందిని, ఎన్నిరకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియచెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి