చంటి తల్లులకే.. చంటి బిడ్డ తండ్రులకు నో ఎంట్రీ..

సోమవారం, 12 జనవరి 2015 (07:33 IST)
తిరుమలలో అప్పుడప్పుడు ధర్మసందేహాలు కలుగుతుంటాయి. మామూలుగా విఐపీలు వస్తున్నారంటే వంగి వంగి దండాలు పెట్టి వారికి సకల సేవలు చేసే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లేదా సిబ్బంది సామాన్యుల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్.. రూల్స్ అత్రికమించరు. ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే మాట జవదాటరు. డౌటాఫ్ బెనిఫిట్ లు ఇక్కడ పని చేయవు. ఇది తెలియని ఓ అమాయకుడు దర్శనం లేకుండానే తిరుగుముఖం పట్టాడు. వివరాలిలా ఉన్నాయి. 
 
హైదరాబాద్‌కు చెందిన  ప్రవీణ్‌లాల్‌సింగ్ తన భార్యా  ఏడాది చంటిబిడ్డ అభిరామ్ సింగ్ తో కలసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చాడు. భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గదిలోనే బస చేసిన గదిలోనే వదిలి పెట్టి వచ్చేశాడు. ఆదివారం యేడాది వయసున్న బిడ్డతో కలసి సుపథ ద్వారా దర్శనానికి బయలుదేరాడు.
 
తన భార్య రాలేదని, తనను, తన బిడ్డను అనుమతిస్తారాని ప్రారంభ సమయంలోనే ఓ అధికారిని అడిగాడు. పర్వాలేదు అనుమతిస్తారని చెప్పడంతో ప్రవీణ్‌లాల్‌సింగ్ క్యూలో వేచి ఉండి  సుపథంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నాడు.  అక్కడ రాగానే చంటిబిడ్డ తల్లి ఉంటేనే దర్శనం, చంటి బిడ్డ తండ్రులకు వర్తించదని అక్కడున్న సిబ్బంది తెగేసి చెప్పారు. ఎంత బతిమలాడినా అనుమతించలేదు. ఆదివారం అంత పెద్ద రద్దీ కూడా ఏమి లేదు కదా.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అనుమతించి ఉండవచ్చు కదా.. అని మీ అనుమానం.. అయినా ప్రవీణ్ సింగ్ ఏమైనా విఐపినా రూల్స్ అతిక్రమించడానికి...

వెబ్దునియా పై చదవండి