ఆధ్యాత్మిక నగరంగా తిరుమల

శుక్రవారం, 6 మార్చి 2015 (21:47 IST)
తిరుమలను పచ్చని ఆధ్యాత్మిక నగరంగా తీర్చుదిద్దుతామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా సాంబశివరావు తెలిపారు. తాము ఆధునాత సాంకేతికతను సంతరించుకున్నామని దాని ద్వారా మంచి ఫలితాలను సాధించే సమయం వచ్చిందన్నారు. రాబోవు రోజుల్లో అనుగుణమైన దర్శనం, బస చేసే సౌకర్యాలు, ప్రసాదాలను పారదర్శకంగా అందజేస్తామని ఆయన తెలిపారు. 
 
 తిరుమల పర్యావణంపై తాము దృష్టి సారించామని చెప్పారు. తిరుమలలో ఉద్యానవన, అటవీశాఖలను సమన్వపరిచి తిరుమల పర్యావణం దెబ్బతినకుండా అనే కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వివరించారు. తిరుమలను భూమిపై ఉన్న వైకుంఠంగా భావిస్తారు కనుక దానికి అనుగుణంగా ఇటు పర్యావరణంగానూ, అటు ఆధ్యాత్మికంగానూ చాలా సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 
 

వెబ్దునియా పై చదవండి