ధనుర్మాసంలో తిరుప్పావై శ్రవణం పవిత్రం.. టీటీడీ జేఈవో

మంగళవారం, 16 డిశెంబరు 2014 (22:04 IST)
ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలను వినడం ఎంత పవిత్రతను పొందినట్లు అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్ అన్నారు. అందుకే తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుప్పావైను నిర్వహిస్తుందని చెప్పారు. తిరుపతిలోని అన్నమచార్య కళాక్షేత్రంలో జరిగిన తిరుప్పావై పారాయణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆండాల్ గోదాదేవి తిరుప్పావై పాసురాలను తమిళంలో రచించిందని చెప్పారు. వేంకటేశ్వస్వామిని కీర్తిస్తూ 30 కీర్తనలను రాసినట్లు వివరించారు. వీటి ప్రతీ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ ఒక్కొక్కటి చొప్పున ఆధ్యాత్మిక భవనంలో ఆలపిస్తారని చేప్పారు. 
 
ఇలా జనవరి 14 వరకూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుందని అన్నారు. తిరుప్పావైపాసురాలను ప్రముఖ సంగీత కళాకారిణి ద్వారం లక్ష్మి పాడి వినిపించారు. ద్వారం లక్ష్మి ఆలపించిన తిరుప్పావై సిడీలను జేఈవో విడుదల చేశారు. 

వెబ్దునియా పై చదవండి