తిరుమలలో పెరిగిన రద్దీ.. మూడు రోజులపాటు విఐపీ దర్శనాలు రద్దు

గురువారం, 1 అక్టోబరు 2015 (21:03 IST)
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. దర్శనానికి చాలా సమయం పడుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం విఐపీ దర్శనాలను రద్దు చేసింది. మూడు రోజుల పాటు ప్రొటోకాల్ మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. 
 
తమిళనాడులో త్రైమాసిక సెలవులు ప్రకటించడం, అలాగే గాంధీ జయంతి వెంటనే శని, ఆదివారాలు రావడంతో భక్తులు చాలా మంది తిరుమల బాట పట్టారు. పైగా తిరుమల శనివారాలలో ఆఖరి శనివారం కావడంతో రద్దీ పెరిగిపోయింది. 
 
గురువారం సాయంత్రానికే తిరుమలలో రద్దీ పెరిగిపోయింది. దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా విఐపీ దర్శనాలను రద్దు చేసింది. ప్రొటోకాల్‌లోని వ్యక్తులకు మినహా ప్రత్యేక బ్రేక్ దర్శనాలను ఇవ్వడం లేదు. ఇది అక్టోబర్ రెండు నుంచి నాలుగు వరకూ కొనసాగుతుంది. 

వెబ్దునియా పై చదవండి