జనవరి 3 నుంచి త్రైమాసిక మెట్లోత్సవం

శనివారం, 20 డిశెంబరు 2014 (11:37 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలో జనవరి 3 నుంచి 5వ తేదీ వరకూ ధనుర్మాస పూజా సహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరగనున్నది. మెట్సోత్సవ సంబరాలు తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక గల టిటిడి గోవింద రాజస్వామి మూడో సత్రంలో ప్రారంభమవుతాయి. ఒకవైపు మెట్లోత్సవం నిర్వహిస్తూ కొందరు తిరుమల కొండకు పయనమైతే తిరుపతిలో మరికొన్ని భజన మండళ్ళు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
 
జనవరి 3,4 తేదీలలో ఉదయం 5 నుంచి 7 గంటల వరకూ భజన మండళ్ళతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి 12 గంటల వరకూ ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన భజన మండళ్లతో సంకీర్తన నామం, మధ్యాహ్న 2.30 గంటల నుంచి 5 గంటల వరకూ ధార్మిక సందేశం వంటి కార్యక్రమాలు ఉంటాయి. 5 గంటల నుంచి 8.30 సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 

వెబ్దునియా పై చదవండి