అత్యధిక పారితోషికం పుచ్చుకోవడంలో జోలీదే అగ్రస్థానం!

FILE
వినోదరంగంలో శక్తివంతమైన వందమంది మహిళల జాబితాలో హాలీవుడ్ హాట్ స్టార్ ఏంజెలీనా జోలీ 24వ స్థానంలో నిలిచింది. అయితే హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటీమణుల్లో హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్‌పిట్ సతీమణి ఏంజెలీనా జోలీదే అగ్రస్థానమని హాలీవుడ్ రిపోర్టర్ వెల్లడించింది.

హాలీవుడ్‌లో రారాణిగా వెలుగొందుతున్న ఏంజెలీనా జోలీ.. అత్యధిక పారితోషికం తీసుకునే జాబితాల్లో హాలీవుడ్ తారలు జూలియా రాబర్ట్స్. రీస్ విదర్ స్పూన్ వంటి నటీమణులను వెనక్కి నెట్టి ఉన్నత స్థానంలో నిలిచిందని కాంటాక్ట్ మ్యూజిక్ తన ప్రచురణలో తెలియజేసింది. ఇంకా గత ఏడాది జోలీ నటించిన ఒక్కో సినిమాకు దాదాపు 2 కోట్ల డాలర్లు పారితోషికంగా తీసుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి