మైఖేల్‌‌కు భారత కళాకారుల స్వరాభిషేకం!

FILE
పాప్ సంగీతాన్ని శాసించిన పాప్‌ రారాజు మైఖేల్ జాక్సన్‌కు భారత కళాకారులు స్వరాభిషేకంతో నివాళులు అర్పించేందుకు సంసిద్ధమయ్యారు.

ఆగస్టు 29న జాక్సన్ 51వ జయంతిని పురస్కరించుకుని.. "మేక్ ఇట్ లార్జ్" పేరిట భారత కళాకారులు ప్రత్యేక ఆల్బమ్‌ను రూపొందించారు. దీన్ని ఈ నెల 28న ఆవిష్కరించనున్నారు.

3 నిమిషాల నిడివి గల వీడియోలో ప్రముఖ గాయకులు షాన్, కేకే, శంకర్, శ్రేయా గోశల్ తదితరులు కన్పించనున్నారు. ఈ గీతాన్ని విశాల్ రాయగా, సమర్ ఖాన్ దర్శకత్వం వహించారు.

ఇందులో ప్రముఖ నృత్యదర్శకుడు ప్రభుదేవా కూడా కనిపించనున్నట్లు తెలిసింది. సంగీతంతో ఎందరినో ప్రభావితం చేసిన సంగీత ధ్రువతారకు తామిస్తున్న చిన్న నివాళి ఇదని భారత కళాకారులు అన్నారు.

ఇదిలా ఉంటే.. మైఖేల్ జాక్సన్ భౌతిక దేహాన్ని ఖననం చేసే కార్యక్రమం సెప్టెంబరు 3వ తేదీన జరుగనుందని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన మైఖేల్ ఖననం.. మూడోసారిగా వచ్చేనెల మూడో తేదీ జరుగనున్నట్లు ఆ దేశ పత్రికలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి