ఫ్రాన్స్‌లో ఒకసారి.. కాలిఫోర్నియాలో రెండోసారి పెళ్లి: ఏంజెలీనా జోలీ

సోమవారం, 12 జనవరి 2015 (14:17 IST)
హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ రెండో సారి పెళ్లి చేసుకుందట. ఇదేంటి అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవండి. అమెరికాలో పిల్లలు, సన్నిహితుల సమక్షంలో జరిగిన పెళ్లి వేడుకకు ముందే ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్‌ల జోడీ ఒక్కటైన సంగతి తెలిసిందే. 
 
గతేడాది ఆగస్టులో పిల్లల సమక్షంలో జరిగిన పెళ్లి తంతుకు ముందే తాము వివాహం చేసుకున్నామని ఏంజెలీనా వెల్లడించింది. 'ఒక రోజు ఫ్రాన్స్‌లో నాలుగు గంటల సమయంలో బ్రాడ్‌ను కలిసిన తరువాత కొన్ని వివాహ పత్రాలపై సంతకాలు చేసి ఇద్దరం ఒక్కటయ్యా'మని ఏంజెలీనా వివరించింది. అయితే ఫ్రాన్స్ లో చేసుకున్న వివాహం అమెరికాలో చట్టబద్ధం కాకపోవడంతో మరోసారి కాలిఫోర్నియాలో వివాహమాడామని జోలీ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి