'ఇండియానా జోన్స్' చిత్రం ద్వారా అమిత ప్రాచుర్యం పొందిన అలనాటి హాలీవుడ్ హీరో హారిసన్ ఫోర్డ్ విమాన ప్రమాదంలో చిక్కుకుని గాయాలపాలయ్యాడు. లాస్ ఏంజెలెస్‌లో రెండు సీట్లున్న చిన్న విమానాన్ని తానే నడుపుకుంటూ వెళ్లి ఆయన స్థానిక ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసేందుకు యత్నించగా గోల్ఫ్ కోర్టులో విమానం పేలిపోయింది.