కడప నడి బొడ్డున ముద్దు గుమ్మ... ఎగబడ్డ కుర్రకారు.

సోమవారం, 22 డిశెంబరు 2014 (15:41 IST)
కడప కోటి రెడ్డి సర్కిల్ వద్ద ఆదివారం ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపులోంచి ఓ ముద్దుగుమ్మ బయటకు వచ్చింది. ఇక చూసుకోండి.. కుర్రకారు వెర్రెత్తి పోయింది. ఒకటే ఈలలు కేకలు.. ఆ ముద్దుగుమ్మ చేయ్యి ఊపింది. ఇక కుర్రకారు హుషారుకు అంతు లేకుండా పోయింది. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అనేగా మీ అనుమానం. ఆమె కాజల్ అగర్వాల్.. విషయం ఏంటి? 
 
కడప నగరం కోటిరెడ్డి సర్కిల్‌లోని కాల్‌టెక్స్ సెంటర్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై ఈ షోరూంను ప్రారంభించారు. ఆమె అక్కడ నుంచి వెళ్ళేంత వరకూ కుర్రకారు అక్కడ నుంచి కట్టు కదల్లేదు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడపకు మొదటిసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ప్రపంచంలో 122వ షోరూంను కడపలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. 

వెబ్దునియా పై చదవండి