మేమిద్దరం విడిపోలేదు.. మాది వందశాతం గాఢమైన ప్రేమ: కాతీ ప్రైస్

ఆదివారం, 20 నవంబరు 2016 (12:57 IST)
హాలీవుడ్ ప్రముఖ నటి, టీవీ స్టార్ కాతీ ప్రైస్‌తో తన భర్తతో తనకు ఎలాంటి విబేధాలు లేవని చెప్పుకొచ్చింది. తాను తన భర్త కైరన్‌ హేలర్‌ గాఢమైన ప్రేమలో ఉన్నామని తెలిపింది. తమ వివాహానికి సంబంధించి ఎలాంటి సమస్యలు రాలేదని స్పష్టం చేసింది. తామిద్దరూ వందశాతం గాఢమైన ప్రేమ అని.. తాము విడిపోతున్నామంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేసింది.
 
కాతీకి తెలియకుండా ఆమె స్నేహితురాళ్లతో కైరన్‌ సంబంధం నెరిపాడని ఈ విషయం తెలిసిన ఆమె విడిపోవాలనుకుంటుందని కాతీ ప్రైస్‌తో తెలిపింది. తాను ఒక టీవీ కార్యక్రమం ఉండటం వల్లే ఈ మధ్య కైరన్‌‌కు కాస్త దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందని.. తాము విడిపోయినట్లు కాదని తెలిపింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కైరన్‌ ఆమెకు మూడో భర్త. 2013 జనవరిలో వివాహం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి