స్పైడర్ మ్యాన్ సిరీస్లో మరో చిత్రం రానుంది. సోనీ పిక్చర్స్, మార్వెల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ పాత్ర కోసం 19 సంవత్సరాల బ్రిటీష్ నటుడు టామ్ హోలాండ్ను ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన స్పైడర్ మ్యాన్ కొత్త సిరీస్ సినిమాకు జాన్ వాట్స్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా జూలై 29, 2017లో విడుదల కానుంది.