అవిసి ఆకు...లాభాలు

మన దేశంలో ప్రకృతి పరంగా లభించే అన్నిరకాల పదార్థాలలో మనిషి శరీరానికి కావలసిన వివిధ పోషక పదార్థాలు లభ్యమవుతాయి. వాటిలో ఆకుకూరలు, కాయగూరలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ఆకుకూరల్లో అవిసి ఆకులకు ఓ ప్రత్యేకత వుంది. కాని దీన్ని ప్రస్తుతం కొంతమంది మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో మనిషికి కావలసిన పోషకపదార్థాలు పుష్కలంగా వున్నాయంటున్నారు వైద్యులు.

అవిసి ఆకులు, పూలు, కాయలను కూడా కూరగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో బలవర్ధకమైన పోషక పదార్థాలున్నాయి. ముఖ్యంగా మలబద్ధకానికి విరుగుడుగా ఇవి బాగా పనిచేస్తాయి. అవిసి చెట్టులోని ప్రతి భాగం ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. అవిసాకులో కాల్షియం, విటమిన్ ఏ, ఐరన్ శాతం అధికంగానే వున్నాయని పేర్కొన్నారు.

**క్యాల్షియం..ఇరవై గుడ్లు, పది కప్పుల పాలు, అరకిలో మాంసం ద్వారా లభించే 'క్యాల్షియం' ఒక గుప్పెడు అవిసాకులో లభిస్తుంది.

**విటమిన్ ఏ..ఇరవై కప్పుల పాలు, ఐదుకిలోల మాంసం ద్వారా లభించే 'విటమిన్ ఏ' ఒక గుప్పెడు అవిసాకుతో లభిస్తుంది.

ఇంకా ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియమ్, పిండి పదార్థం, ప్రొటీన్లు అవిసాకులో పుష్కలంగా ఉన్నాయని పరిశోధకలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి