కొత్తిమీరతో వాంతులకు చెక్

వంటింట్లో తాజా కొత్తిమీర ఉందంటే ఆ ఇళ్ళంతా సువాసనలు వెదజల్లుతుంటుంది. కూరల్లో వేస్తే గుమగుమలాడిస్తుంది. కొందరైతే కొత్తిమీర లేని కూరా..! ఒక కూరేనా అంటారు. కూరలు, రుచులు వారివారి అభిరుచులను అనుసరించి ఉంటుంది.

కానీ కొత్తిమీరలో కూడా ఔషద గుణాలున్నాయి.... తెలుసా..! వాంతులు అవుతుంటే కాసింత కొత్తిమీర వాసన చూస్తే చాలు టక్కున ఆగిపోతాయి. పార్శ్వ నొప్పులు, తలనొప్పులను వెంటనే నివారిస్తుంది. దీనివలన కంటి కూడా చాలా మంచిది. చలువ చేస్తుంది.

కొత్తిమీర కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారిస్తుంది. దీనిని ముందు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. తరచు కొత్తిమీర ఏదోక రూపంలో తీసకుంటే మూత్రపిండ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది పైత్యాన్ని కూడా పోగొడుతుంది.

వెబ్దునియా పై చదవండి