క్యాబేజీలో పోషక పదార్థాలు

సహజ కూరలే ఆరోగ్యానికి ఆయువు పట్టు. ఇది ఇప్పటి మాట కాదు. తర తరాలుగా వస్తుందన్నదే. మొదట్లో పూర్తిగా వృక్ష సంపదపై ఆధారపడి జీవించిన మనిషి కాలానుగుణంగా మారుతూ వచ్చాడు. మాంసాహారాన్ని అలవరుచుకున్నాడు. అయితే రోజూ తినే కూరల్లోనే ఆరోగ్యానికి దోహదపడేవి ఎన్నో ఉన్నాయి.

క్యాబేజీ నుంచి ఎంతో మేలు ఉంటుంది. పప్పులు ఒక్క ముక్క వస్తే పక్కన పెట్టే వారు చాలా మంది ఉన్నారు. దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఉబ్బసం వ్యాధి నుంచి ఉపశమనం కలిగించే పదార్థాలున్నాయి. దీనిని తినడం వలన ఉబ్బసం వ్యాధితో బాధ పడేవారికి ఆరోగ్యపరమైన మేలు కలుగుతుంది.

క్యాబేజీ పొరలలో పోషక పదార్థాలున్నాయి. దీనివలన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. క్యాబేజీ తినడం వలన చర్మం నునుపుగా మారుతుంది. చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. కాబట్టి చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది. అలాగే మలబద్దక సమస్యలు తీరుతాయి.

వెబ్దునియా పై చదవండి