గర్భిణీ స్త్రీలకు లవంగాలు...లాభదాయకం

Gulzar Ghouse

సోమవారం, 9 ఫిబ్రవరి 2009 (13:46 IST)
మనం తరచూ వంటలకు ఉపయోగించే లవంగాలలో వైద్యగుణం వున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ లవంగాలు గర్భిణీ స్త్రీలు తీసుకుంటే వారియొక్క గర్భాశయాన్ని బలోపేతం చేయడమే కాకుండా గుండె, కిడ్నీలు, ఊపిరి తిత్తులకు కూడా మంచి బలవర్ధకమైనదిగా వైద్యులు పేర్కొన్నారు.

** గర్భస్థ దశలోనున్న స్త్రీలకు తరచూ వాంతులు, అజీర్తీ , కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, వికారం కలిగినట్లు వుంటుంది అలాంటప్పుడు లవంగాలను తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

** ఏడు లంవగాలను చితగొట్టి పావు గ్లాసు నీటిలో వేసి సగం నీళ్ళు మిగిలేలా మరిగించి, వడగట్టి, కాసింత తీపి పదార్థాన్ని కలుపుకుని తాగితే వాంతులు, వికారంతగ్గుతుంది. ఇదే కాకుండా శరీరం కూడా తేలికగావుంటుందని వైద్యులు సూచించారు.

** గర్భవతులుగావున్నప్పుడు శరీరానికి నీరు పట్టి, ముఖం బాగా ఉబ్బినట్టు వుంటుంది. అప్పుడు లవంగాల కషాయం తీసుకుంటే ఆ వాపు తగ్గుతుంది.

** గర్భావస్థలోనున్నప్పుడు స్త్రీలకు పదేపదే మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది. దీనిని నివారించడానికి లవంగాల కషాయం తీసుకుంటే అతిగా మూత్రం అవడం నెమ్మదిస్తుందని వైద్యులు తెలిపారు.

** లవంగాల పొడిని ఆవుపాలలో వేసి ప్రతిరోజు సగంపాలు మరిగేంత వరకూ కాచుకుని తీపి పదార్థం కలుపుకుని తాగితే, రక్తంతో సహా శరీర ధాతువులన్నీ పుష్టిగా తయారవుతాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

వెబ్దునియా పై చదవండి