మర్రి చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే....!

సోమవారం, 7 ఏప్రియల్ 2014 (16:38 IST)
File
FILE
అరిటాకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని మన పెద్దలు, వైద్యులు చెబుతున్నారు. ఆకుపచ్చని అరటి ఆకులో వేడి వేడి పదార్థాలను వేసుకుని భుజించటంవల్ల కఫవాతాలు తగ్గిపోతాయన్నది వారి అభిప్రాయం. శరీరానికి బలం చేకూరుతుంది. మంచిగా ఆకలి కలుగుతుంది. ఆరోగ్యం చక్కబడి, శరీరానికి మంచి కాంతి వస్తుంది.

పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినటంవల్ల త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందనీ, మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని అంటుంటారు. మహా విష్ణువు స్వరూపం అయిన మర్రిచెట్టు ఆకులతో అన్నం తింటే, క్రిమిరోగ నివారిణిగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది.

అరటి, మోదుగ ఆకులలో భోజన చేయటంవల్ల ప్రేగులలోని క్రిములు నాశనం అవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అలాగే అరటి చెట్ల నుంచి లభించే అరటిపండు కూడా చాలా శ్రేష్టమైనది. ఈ పండులో అత్యధికంగా లభించే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడులను హరిస్తుంది. అరటిపండును రాత్రివేళల్లో పాలతోపాటు తీసుకుంటే చక్కగా నిద్ర పడుతుంది.

వెబ్దునియా పై చదవండి