మలబద్దకమా.....బీట్‌రూట్ వాడండి

మలబద్దకంతో బాధపడుతుంటే ప్రతిరోజు బీట్‌రూట్‌ను ఆహారంలో ఉండేలా చూసుకుంటే మంచిదంటున్నారు వైద్యులు. ఇందులో ఉన్న పీచు పదార్థం మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఉడికించని బీట్‌రూట్‌ను తేనెతో కలిపి తింటే శరీరానికి కావలసిన విటమిన్ సి లభిస్తుంది.

కొన్ని దేశాలలో బీట్‌రూట్ నుండి చక్కెరను తయారు చేస్తున్నారు. బీట్‌రూట్ ఆకులను కూడా అన్ని ఆకుకూరలలాగానే ఆహారంగా తీసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.

లావుగా వున్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహాల మేరకు బీట్‌రూట్‌ను నిరభ్యంతరంగా వాడొచ్చని వారు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి