రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే..!?

బుధవారం, 11 జనవరి 2012 (11:07 IST)
FILE
లవంగాల్లోని యుజెనాల్ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.

* పంటి నొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగ మొగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది.

* ఒక లవంగ మొగ్గను బుగ్గన పెట్టుకుంటే నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది.

* రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక కలగదు.

* లవంగాలను నీళ్లలో మరిగించి తాగడం వల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.

* లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది.

* పెద్ద పేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మ జీవుల్నీ లవంగంలోని 'యుజెనాల్' నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందుగా ఉపయోగపడుతుంది.

* రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది.

* జలుబుతో బాధ పడేవాళ్లు కర్ఛీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే వెంటనే తగ్గిపోతుంది.

* ఏడు మొగ్గల్ని కొద్దినీళ్లలో మరిగించి దాని నుంచి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తరవాత ఆ నీటిని తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి హాయిగా ఉంటుంది.

* లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవటడంతో బాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్, ఆర్థ్రైటిస్, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయట.

వెబ్దునియా పై చదవండి